గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / సినిమా కథలను మించిన క్రూరత్వం రియల్ లైఫ్లో వెలుగుచూసింది. మేడ్చల్ జిల్లా పోచారం ప్రాంతంలో అత్యంత అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కక్షతో ఓ యువకుడు, యువతికి హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా బలవంతంగా ఎక్కించాడ
వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ లోని పోచారం ఐటీకారిడార్ పీఎస్పోపరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని యువతికి ఓ యువకుడు హెచ్ఐవీ ఉన్న రక్తాన్ని ఎక్కించాడు. నిందితుడు మనోహర్తో బాధిత యువతికి గతంలో వివాహం నిశ్చయమైంది. అయితే.. అతడికి హెచ్ఐవీ ఉందని తెలియడంతో ఆమె పెళ్లికి నిరాకరించింది. ఈ క్రమంలోనే ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లి అతడు.. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో హెచ్ఐవీ ఇంజెక్షన్ ఎక్కించి పారిపోయాడు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.









