గ్రామపంచాయతీ భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పద్మాపురం గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  స్థానిక సర్పంచ్ తోలెం రమేష్, ఉప సర్పంచ్ పటాన్ యాకూబ్, కరకగూడెం సర్పంచ్ పోలెబోయిన సుజాత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్బా ఇక్బాల్ హుస్సేన్, ఎర్ర సురేష్, పోలెబోయిన తిరుపతయ్య, శ్రీవాణి, స్థానిక అధికారులు తదితరులతో కలిసి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయతీ నూతన భవనం నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రావడంతో పాటు గ్రామ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram