ఈ నెల 22న రైతు భరోసా తొలి విడత నిధుల విడుదల

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా ఈ నిధులను విడుదల చేయనున్నారు.

నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.

తొలి దశలో ఒక ఎకరం వరకు భూమి ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ₹3,590 కోట్లు జమ చేయనున్నారు.

రెండవ విడత: మరో 20 రోజుల వ్యవధిలో ₹2,650 కోట్లు విడుదల కానున్నాయి.

మూడవ విడత: ఏప్రిల్ చివరి నాటికి మూడవ దశ నిధులను విడుదల చేస్తారు.

మూడు దశల్లో కలిపి మొత్తం ₹9,000 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

Facebook
WhatsApp
Twitter
Telegram