బస్సు నదిలో పడి 10 మంది మృతి

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దౌలత్‌దియా ఘాట్ సమీపంలో 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి పద్మా నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా, 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బస్సును ఫెర్రీపైకి ఎక్కించే సమయంలో నియంత్రణ కోల్పోవడంతో ఇది సుమారు 35 అడుగుల లోతున్న నదిలోకి దూసుకెళ్లింది. అనంతరం భారీ క్రేన్ సాయంతో బస్సును బయటకు తీశారు. గల్లంతైన వారి కోసం డైవర్లు, గజ ఈతగాళ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram