కీచక ఉపాధ్యాయుడు

విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినీని ఉపాధ్యాయుడు కంప్యూటర్ గదిలోకి తీసుకెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సదరు ఉపాధ్యాయుడిని విచారించినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Facebook
WhatsApp
Twitter
Telegram