అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంలో దారుణం.
భర్తను చంపి ఇంటి ముందే పాతిపెట్టిన భార్య సుకన్య.
4 నెలల క్రితం భర్త హనుమంతు (35)ను చంపిన భార్య.
తల్లి, కూతురు గొడవ పడడంతో బయటపడ్డ హత్యోదంతం.
వివరాల్లోకి వెళితే.. బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లికి చెందిన హనుమంతు(36)తో పదిహేడేళ్ల క్రితం వాహమైంది. పదేళ్ల ముందు వీరు కళ్యాణదుర్గం మండలం పాతచెరువుకు వచ్చారు. హనుమంతు గొర్రెలు కాస్తుండగా.. సుకన్య కూలి పనులకు వెళ్లేది. వీరికి ఇంటర్ చదువుతున్న కుమార్తె, కుమారుడు (గొర్రెల కాపరి) ఉన్నారు. నాలుగు నెలల క్రితం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన హనుమంతు భార్యతో గొడవపడ్డాడు. ఆమె అక్కడే ఉన్న రోకలితో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. వెంటనే సుకన్య ఇంటిముందే గొయ్యితీసి పాతిపెట్టింది. ఇరుగుపొరుగుకు అనుమానం రాకుండా తన భర్త తాగిన మైకంలో ఇల్లు వదిలి వెళ్లాడని చెప్పుకొచ్చింది. బెళుగుప్ప,కళ్యాణదుర్గం పోలీసు స్టేషన్లలో ఫిర్యాదుచేసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని కుమార్తె బెదిరించ డంతో ఆమె ఎవరికీ చెప్పలేదు. ఇటీవలతల్లి, కూతురు గొడవ పడడంతో బయటపడ్డ హత్యోదంతం. పోలీసుల పలీసుల ఎదుట లింగిపోయిన సుకన్య .









