గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్/ జర్నలిస్టులకు కనీస వేతనం, ఇండ్ల స్థలాలు, సంక్షేమ పథకాలు ఇవ్వాలని కొత్తగూడెం శాసన సభ్యులు, సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, అన్నారు. జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. జీరో అవర్‌లో జర్జలిస్టుల సమస్యలపై ఆయన మాట్లాడారు.సబ్సిడీతో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు అందించాలని కోరారు. హెల్త్ కార్డులు, జీవిత బీమా, రిటైర్ జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాలు కేటాయించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్న పత్రికలకు యాడ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
Post Views: 329









