నక్సలిజం దాదాపు అంతమైంది కేంద్ర మంత్రి అమిత్ షా

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ / ఒకానొక సమయంలో  మావోయిస్టులకు  కంచుకోటగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్లో నక్సలిజం దాదాపు అంతమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. నక్సలిజం నిర్మూలన చర్యలపై సోమవారం ఆయన లోక్సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా నక్సలిజం దాదాపు అంతమైందని పేర్కొన్నారు. బస్తర్లో ప్రతి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణలో అనేక మంది నక్సల్స్ నేతలు లొంగిపోయారని, అలాగే దేశంలోని  మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి అన్నారు. సమాజంలో అన్యాయాలు జరిగినప్పుడు రాజ్యాంగంలో పరిష్కార మార్గాలు ఉన్నాయని, ఆయుధాలు చేత బోనడం సరైన మార్గం కాదని ఆయన అన్నారు. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆయుధాలు పట్టుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని. నక్సలిజాన్ని సమర్థించే వారు అర్థం చేసుకోవాలన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram