మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్య ఇద్దరు పిల్లలపై దాడి

కొందరు వ్యక్తులు మద్యానికి బానిసలుగా మారి ఉన్మాదులుగా తయారవుతున్నారు. మత్తు వినాశకాలు అన్నీ ఇన్నీ కావు. మద్యం మత్తు జీవితాన్ని ఛిద్రం చేయడంతోపాటు ఎన్నో జీవితాలను కనుమరుగు చేసిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.

 

తాజాగా ఇలాంటి దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలు, కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ  ఘటనలో భార్య, కొడుకు మృతి చెందగా…కూతురు తీవ్ర గాయాలతో  కొట్టుమిట్టాడుతుంది.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీతారాంనగర్ తండ గ్రామపంచాయతీ పరిధిలోని పులిగోనిపల్లి తండాలో బాణావత్ రాందాస్ నాయక్, కవిత అనే దంపతులు నివసిస్తున్నారు.

 

ఈ దంపతులకు కూతురు పవిత్ర, కుమారుడు హర్షలు ఉన్నారు. ఆమనగల్లు పట్టణ సమీపంలోని సూర్యలక్ష్మి కాటన్ మిల్‌లో రాందాస్ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

 

కవిత మేస్త్రి పని కూలికి వెళ్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంది. ఇటీవల దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి.

 

ఈ క్రమంలో మంగళవారం తెల్లవారు జామున రాందాస్ నాయక్ ఫుల్‌గా మద్యం సేవించి భార్య కవితతో గొడవ పెట్టుకున్నాడు. క్షణికావేశంలో భార్య, కుమారుడు, కూతురును కత్తితో పొడిచాడు.

 

దీంతో భార్య, కుమారుడు ఘటనాస్థలంలోనే మృతి చెందగా కూతురు కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. కవిత ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram