గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్ / నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శని వారం రోజున పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు సి,సి ఎస్, ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సి,సి ఎస్, సిబ్బంది పేకాట స్థావరంపై మెరుపుదాడి నిర్వహించారు. జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగొట్ గ్రామ శివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై నేడు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నాలుగు వాహనాలు, మూడు సెల్ఫోన్లు మరియు రూ.10,940 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు..
Post Views: 17









