గోల్డెన్ న్యూస్/జగిత్యాల / అప్పటిదాకా దైవ సన్నిధిలో కుటుంబ సభ్యులతో గడిపిన మూడోతరగతి విద్యార్థి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తోపారపు చంద్రశేఖర్-నవిత దంపతుల కుమారుడు నిశాంత్ (9) గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు.
గ్రామంలోని వ్యవసాయ పొలం వద్ద ఉన్న శివాలయంలో అన్నదానం కార్యక్రమం జరుగుతుండగా, ఒక్కసారిగా కుప్పకూలిపోయిన నిశాంత్
అక్కడ ఉన్న వారు వెంటనే అప్రమత్తమై బాలుడిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలిన నిశాంత్…
Post Views: 253









