గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ /ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్లకు అతి త్వరలో లైన్ క్లియర్ కానుంది, తెలంగాణ రాష్ట్రంలో ఇన్- సర్వీస్ ఉపాధ్యాయుల ప్రమోషన్లకు ప్రధాన అడ్డంకిగా ఉన్న సమస్య లను తొలగించే దిశగా చర్యలకు పూనుకుంది. ఉపాధ్యాయులు ప్రమోషన్ కు అర్హత సాధించాలంటే.. తప్పకుండా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్,క్వాలిఫై కావాలి. కానీ చాలా మంది టీచర్లు ఈ అర్హత సాధించ క పదోన్నతులకు దూరమ వుతున్నారు.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, సర్కార్ వారికి శుభవార్త చెప్పింది. ఈ ఏడాది డిసెంబర్ లోపు రెండు ప్రత్యేక టెట్ పరీక్షలను నిర్వహించాలని భావిస్తోన్న విద్యాశాఖ.. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. గతంలో 2011 కంటే ముందు నియమితులైన టీచర్లకు టెట్ నుంచి మిన హాయింపు ఉంటుందని భావించారు. కానీ 2025 లో సుప్రీంకోర్టు వెలువరిం చిన తీర్పుతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
దీని ప్రకారం.. పదోన్నతు లు పొందే ప్రతి ఉపాధ్యా యుడు.. టెట్ పాస్ కావ డం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో టెట్ క్వాలిఫై కాని టీచర్లు.. 31 మార్చి 2027 నాటికి టెట్ సాధిం








