ఖాతాదారు, నామినీ ఇద్దరూ మరణిస్తే.. బ్యాంకు డబ్బు వారసులకే!

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / ఖాతాదారు, నామినీ ఇద్దరూ మరణిస్తే.. బ్యాంకు డబ్బు వారసులకే!

బ్యాంకు ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణించిన సందర్భంలో, డిపాజిట్ చట్టబద్ధమైన వారసులకు చెందుతుందని RBI, బ్యాంకింగ్ చట్టాలు స్పష్టం చేశాయి. నామినీ కేవలం ధర్మకర్త మాత్రమేనని, ఆస్తి యజమాని కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. వీలునామా ఉంటే దాని ప్రకారం, లేదంటే వారసత్వ చట్టాల ప్రకారం వారసత్వం నిర్ణయమవుతుంది. 10 ఏళ్ల తర్వాత క్లెయిమ్ చేయని డబ్బు DEAF నిధికి బదిలీ అయినా, వారసులు ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. నామినీ లేకపోయినా, చట్టబద్ధమైన వారసులకే ఆ నిధులు చెందుతాయి. ఉమ్మడి ఖాతాల్లో ఒక ఖాతాదారుడు మరణిస్తే, మరొకరికి పూర్తి హక్కులు లభిస్తాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram