లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు అందజేసిన ఎస్పీ రోహిత్ రాజు

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం /  ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు  తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రివార్డులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో  ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా అందజేశారు. రివార్డులను అందజేశారు. పోలీసులు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ క్యాడర్లలోని 10 మంది సభ్యులకు మొత్తం రూ.55,60,000లను చెక్కుల రూపంలో అందజేశారు. మావోయిస్టు పార్టీలో వారు నిర్వహించిన బాధ్యతలు, క్యాడర్ స్థాయిని ఆధారంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ రివార్డులను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

రివార్డులు అందుకున్న వారిలో ఒకరు స్టేట్ కమిటి మెంబర్, ఒకరు డివిజనల్ కమిటీ మెంబర్, ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు, ఇద్దరు దళ సభ్యులు ఉన్నారు.

 

ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు లొంగిపోయిన సభ్యుల ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన నగదును విలాసాలకు వినియోగించకుండా, జీవనోపాధికి ఉపయోగపడే విధంగా సక్రమంగా ఖర్చు చేసుకోవాలని సూచించారు.

 

జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న “ఆపరేషన్ చేయూత” కార్యక్రమానికి ఆకర్షితులై మరింత మంది మావోయిస్టులు లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి పునరావాసంతో పాటు ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల పయోజనాలు,

జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న “ఆపరేషన్ చేయూత” కార్యక్రమానికి ఆకర్షితులై మరింత మంది మావోయిస్టులు లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. లొంగిపోయిన పునరావాసంతో పాటు ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రయోజనాలు, వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram