సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్( ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి ముద్దా. బిక్షం.
గోల్డెన్ న్యూస్ /మణుగూరు / పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంద) జిల్లా కార్యదర్శి ముద్దా. బిక్షం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15 న లీటర్ పెట్రోల్, డీజిల్ పైన మూడు రూపాయలు పెంచిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా సుమారుగా మరో రూపాయి వరకు పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల సరుకుల రవాణాపై, ఇతర వాటి పై దీని ప్రభావం పడి నిత్యావసర సరుకుల ధరలు, ఇతర ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడే ప్రమాదం ఉందన్నారు. కావున పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 29, 30 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోజరుగు నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి, డివిజన్ నాయకులు చెట్టి పెళ్లి. నాగేశ్వరరావు, పి. సంజీవరెడ్డి, ఎన్. రాజశేఖర్ రెడ్డి, సమ్మయ్య, బుచ్చిరాములు, మల్సూరు తదితరులు పాల్గొన్నారు.









