బక్రీద్ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు

బక్రీద్ పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణా నివారించడం పై అధికారులకు ఆదేశాలు జారీ

సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు

 

మణుగూరు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు

గోల్డెన్ న్యూస్ /మణుగూరు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మణుగూరు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో గురువారం నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా దృష్టి సారించాలని అదేవిధంగా పశువుల అక్రమ రవాణా పై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని తెలిపారు. అనంతరం అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని తెలిపారు.గంజాయి అక్రమ రవాణా,మట్కా,క్రికెట్ బెట్టింగులు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు.అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చేసి నేరాల నియంత్రణకు పాటుపడాలని అన్నారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నిత్యం వాహన తనిఖీలు చేపడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

ఈ సమావేశంలో మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు నాగబాబు, అశోక్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు సురేష్ , పి.వి.ఎన్ రావు, నగేష్, రాజేష్ ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram