తెలంగాణలో అల్పపీడన ప్రభావం ఈ రాత్రి వరకు కొనసాగనుంది
వాతావరణ శాఖ సూచన
గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ / తెలంగాణపై అల్పపీడన ప్రభావం చివరి దశకు చేరుకుంది. రానున్న 12–18 గంటల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ నుంచి అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వచ్చే 12–18 గంటల పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలోని ఇతర జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Post Views: 13









