మేడారంలో ఉగ్రరూపం దాల్చిన జంపన్న వాగు

ఒక భక్తుడు గల్లంతు.

 

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు  కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను కుండపోత వర్షాలు తీవ్రంగా ముంచెత్తుతున్నాయి. గత 48 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తి జలమయమయ్యాయి. ఇందులో భాగంగా ములుగు జిల్లా మేడారంలో జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వాగులో స్నానానికి దిగిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన ఓ భక్తుడు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. వాగులు, వంకలు, నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram