దివ్యాంగ బాల బాలికలకు మండల స్థాయి క్రీడా పోటీలు

దివ్యాంగ బాల బాలికలకు మండల స్థాయి క్రీడా పోటీలు

 

కరకగూడెం  : మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ భవిత పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న దివ్యాంగ బాల బాలికలకు మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయురాలు ఐఈఆర్టీ జి. విజయకుమారి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించారు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ గడ్డం. మంజుల హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగ బాల బాలికలు చదువుతో పాటు క్రీడలు, ఇతర అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. వారికి ప్రోత్సాహం అందిస్తే మరింత ప్రతిభను కనబరుస్తారని తెలిపారు.

 

కరకగూడెం పోలేబోయిన సర్పంచ్ సుజాత కార్యక్రమానికి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. దివ్యాంగ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

 

ఈ సందర్భంగా విద్యార్థులకు కుర్చీ ఆట, పరుగు పందెం, స్పూన్ రేస్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వివిధ క్రీడా విభాగాల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.

 

కార్యక్రమంలో భట్టుపల్లి పాఠశాల హెడ్‌మాస్టర్ మోహన్‌బాబు, కరకగూడెం ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, సిఆర్పి సాంబశివరావు ప్రత్యేక విద్యా సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram