కరకగూడెం : మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం వృద్ధులకు పిల్లలకు పళ్ళు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎర్ర సురేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగ బండి వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూణెం శ్యాం కుమారి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు చౌలం కేశవరావు ఉపాధ్యక్షులు కల్తీ విజయ్, సర్పంచులు పోలేబోయిన సుజాత, ఎర్రం పొట్టయ్య, ఎల్లబోయిన ముత్తమ్మ, మాజీ సర్పంచ్ నాయకులు తోలెం నాగేశ్వరరావు, ఉప సర్పంచులు పూజారి వెంకన్న గాంధర్ల రామనాథం,మాజీ ఉప సర్పంచ్ కొమరం వెంకటేశ్వర్లు,మండల నాయకులు షేక్ రఫీ, చందా నాగేశ్వరరావు, వట్టం చొక్కయ్య, కరకపల్లి నాగేష్, మేడి శ్రీను, జిమ్మిడి నవీన్, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు









