కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా
కరకగూడెం : ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, రఘునాథపాలెం గ్రామానికి చెందిన పోలేబోయిన నర్సయ్య (లేటు) సతీమణి నాగేంద్ర ఇటీవల మరణించగా, తల్లిదండ్రులను కోల్పోయిన వారి ఇద్దరు కుమార్తెల పరిస్థితిని తెలుసుకున్న కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ , పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు వారి స్వగృహానికి వెళ్లి, నాగేంద్ర చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తన వంతుగా ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు మాట్లాడుతూ..తల్లిదండ్రులను కోల్పోయిన ఈ ఇద్దరు ఆడపిల్లలకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని కోరారు. సెరిబ్రల్ పాల్సీ (CP) సమస్యతో బాధపడుతున్న పెద్ద కుమార్తె సంజీవరాణి ఆరోగ్య సంరక్షణకు, చిన్న కుమార్తె అశ్విత చదువు మరియు భవిష్యత్తుకు అవసరమైన సహాయం అందేలా కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు.
ఈ ఇద్దరు ఆడపిల్లల పరిస్థితిని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లి, వారి భవిష్యత్తుకు అవసరమైన సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి, తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మండల SC సెల్ అధ్యక్షులు జాడి శ్రీను , మండల నాయకులు సొలం రామకృష్ణ గ, పోలేబోయిన కృష్ణమూర్తి , పోలేబోయిన రాంబాబు , గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.








