రోడ్డుపైకి నీరు.. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే !

భద్రాచలం :  పట్టణంలోని ద్వారకానగర్ కాలనీలో డ్రైనేజీ నుంచి మురుగునీరు రోడ్డుపైకి ప్రవహిస్తూ స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న దృశ్యం పై  భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తక్షణమే స్పందించారు. కాలనీలో నెలకొన్న పరిస్థితిని గమనించిన ఆయన సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టారు.

ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడి, తక్షణమే సిబ్బందిని పంపించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం సంబంధిత సిబ్బందిని అక్కడికి రప్పించి, స్వయంగా దగ్గరుండి డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. పనుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశా

మురుగునీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

 

ప్రజా సమస్యలపై తక్షణ స్పందన.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ!

ప్రజలకు ఎదురయ్యే సమస్యలను తన దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు ఎమ్మెల్యే చూపిన చొరవపై ద్వారకానగర్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ తెల్లం వెంకట్రావుకు అభినందనలు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram