43 మంది మహిళలకు విముక్తి

హైదరాబాద్‌లో అక్రమ అండాల సేకరణ, విక్రయాల రాకెట్ గుట్టురట్టు.. 43 మంది మహిళలకు విముక్తి

 

మల్కాజిగిరి, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన పోలీసులు.. అక్రమ అండాల (Oocyte) సేకరణ, వాణిజ్య విక్రయాల రాకెట్‌ను గుర్తించారు. ఈ కేసులో 8 మందిని అదుపులోకి తీసుకుని, 43 మంది మహిళలను రక్షించారు.

 

వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలకు డబ్బు ఆశ చూపి, అండాల సేకరణ ప్రక్రియ కోసం హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంలో మహిళలను ప్రలోభపెట్టి నియమించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

 

మల్కాజిగిరి సీపీ బి. సుమతి, ఐపీఎస్ పర్యవేక్షణలో బేగంపేట, సరూర్‌నగర్ పోలీసులు SOT బృందాలతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. కేసులో మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram