జనగామ జిల్లాలో విషాదం..
రైలు కిందపడి యువతి మృతి!
జనగామ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రైలు కిందపడి 24 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది.
కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్ కాలనీకి చెందిన కుంటి శ్రావణి ఈ ఘటనలో మృతి చెందింది.
అనారోగ్య సమస్యలతో పాటు, తన వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం.
ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Post Views: 29









