సర్పంచ్ ఆధ్వర్యంలో చెట్ల కొమ్మల తొలగింపు

 

కరకగూడెం :   కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలో రహదారికి ఇరువైపులా పెరిగి, వాహనాల రాకపోకలకు మరియు ప్రజల రవాణాకు ఇబ్బందిగా మారిన చెట్ల కొమ్మలను సర్పంచ్ పోలెబోయిన సుజాత ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది తొలగించడం జరిగింది.

 

రహదారిపై ప్రయాణించే వాహనదారులకు, పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ పోలబోయిన సుజాత  తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, చిట్టి పెద్ద వెంకన్న , వీర నరసింహారావు , గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram