పెనాల్టీ విధానాన్ని రద్దు చేయాలి.
ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, టి యు సి ఐ మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి పి. సంజీవరెడ్డి.
గోల్డెన్ న్యూస్ మణుగూరు: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని, పెనాల్టీ విధానాన్ని రద్దు చేయాలని, ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ,టి యు సి ఐ మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి పి. సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన దశల వారి ఆందోళన పిలుపులో భాగంగా మణుగూరు లోని వివిధ విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల అడ్డాల వద్ద కరపత్రాల ఆవిష్కరణ చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుమ్ము ,ధూళీ లో పర్మినెంట్ కార్మికుల తో సమానంగా పనిచేస్తున్నప్పటికీ కాంట్రాక్టు కార్మికులకు సరైన వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోలేక కాంట్రాక్ట్ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. కాంట్రాక్టు కార్మికులు అనారోగ్యం వలన కానీ, ఇతర ముఖ్యమైన పనుల వల్ల కానీ కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరు కాకపోతే పెనాల్టీలు విధిస్తున్నారు అన్నారు ఇది సరైనది కాదన్నారు. నర్సరీ లాంటి కొన్ని విభాగాలలో కనీస వేతనాలు, ఇతర చట్టబద్ధ హక్కులు ,సౌకర్యాలు నేటికీ అమలు కావడం లేదన్నారు. కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా చెల్లించాలని అనేక సంవత్సరాలుగా పోరాడుతుంటే గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5000 రూపాయలు చెల్లించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. అదేవిధంగా వేతనాల పెంపుదల విషయంలో కూడా దృష్టి పెట్టాలన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, పెనాల్టీ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనాలు ఇతర చట్టబద్ధ హక్కుల సౌకర్యాలు అమలుగాన్ డిపార్ట్మెంట్లో అమలు చేయాలని ప్రభుత్వాన్ని ,సింగరేణి యాజమాన్యాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్. ప్రసాద్, సతీష్, జానయ్య, దేవి కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు..









