అద్దె కడతారా..? ఆత్మహత్య చేసుకోమంటారా.!

 భవన యజమాని నిరసనతో కంగుతున్న ఉద్యోగులు..

గోల్డెన్ న్యూస్, వనపర్తి : అమరచింత మండలంలో మండల ప్రజా పరిషత్‌ కార్యాలయానికి అద్దె చెల్లించట్లేదని భవన యజమాని తాళం వేసి పెట్రోల్‌ డబ్బాతో బైఠాయించి నిరసన తెలిపారు. మూడు సంవత్సరాల నుంచి అద్దె చెల్లించకపోవడంతోనే కార్యాలయానికి తాళం వేసినట్టు తెలిపారు. ఈ కారణంగా గంటపాటు ప్రభుత్వ ఉద్యోగులు బయటనే ఉండాల్సి వచ్చింది. భవనం అద్దె చెల్లించే వరకు కార్యాలయం లోపలికి ఎవ్వరిని రానివ్వనని తేల్చి చెప్పారు. అనంతరం ఎంపీడీవో శ్రీనివాసులు వచ్చి నచ్చచెప్పడంతో కార్యాలయానికి వేసిన తాళం తెరిచాడు.మొదటగా అద్దె బకాయి చెల్లించే వరకు కార్యాలయం లోపలికి అధికారులను రానిచ్చేదే లేదని యజమాని చేసిన నిరసనకు ఉద్యోగులంతా షాక్ అయ్యారు..
Facebook
WhatsApp
Twitter
Telegram