నిత్యం శత్రుత్వంతో ఒక్కదానిపై ఒకటి కనబడితే కసితీరా కొరికేద్దామని రగిలిపోయే మూడు రకాల జంతువులు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కన్నారావుపేట గ్రామంలో తండరాజు ఇంట్లో స్నేహం చేస్తూ చూపరులను ఆకట్టుకుం టున్నాయి.
వివరాల్లోకి వెళితే గత రెండు నెలల క్రితం తల్లి చనిపోయిన కోతి తండరాజు ఇంటికి వలస వచ్చింది. కుక్కలు కుందేళ్లు పక్షులు వివిధ రకాలైన జంతువులను పెంచుకోవడం వాటితో ప్రేమగా ఉండడం రాజు కుటుంబానికి అలవాటు. దీంతో పాలు తాగే వయసున్న కోతి పిల్లను చేరదీసిన రాజు దంపతులు తన ఇంట్లో పెంచుకుంటున్న కుక్క అదే విధంగా పిల్లి తో స్నేహం చేయించారు. దీంతో కోతి పిల్లలకు ఆకలి కాగానే శునకం వద్దకు విచ్చేసి జంతు భాషలో తన ఆకలిని తెలుపుతూ ఉండడంతో కింద పడుకొని తన పిల్లల వలె వైరాన్ని మరిచి కోతి పిల్లలకు పాలిస్తుండడం పలువురిని మబ్బులపరిచింది. అంతే కాదు మార్జాలం సైతం కోతి కుక్కలతో స్నేహం చేస్తూ తండ రాజు ఇంట్లో సందడి చేస్తుండడం జాతి వైరం మాకు లేదు అన్నట్లు జంతువులు తమ వైరాన్ని మరిచి స్నేహం చేస్తూ మానవాళికి గొప్ప సందేశం ఇస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు..









