సమ్మక్క-సారక్క వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించిన మంత్రి సీతక్క

చిరుమళ్ళ లో సమ్మక్క – సారక్క వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించిన మంత్రి సీతక్క. – ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

గోల్డెన్ న్యూస్/కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చిరుమళ్ళ జాతర ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా వనదేవతలు సమ్మక్క సారలమ్మలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, పినపాక శాసనసభ్యులు వెంకటేశ్వర్గు గురువారం  దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ జాతర ఈ నెల 15 వరకు జరుగుతుంది. కాగా, ప్రతి రెండేళ్లకోసారి చిరుమళ్ళ జాతర జరగనున్న విషయం తెలిసిందే.బుధవారం రాత్రి పూజారులు సమ్మక్క పూజ మందిరం నుంచి పసుపు, కుంకుమ, నైవేధ్యం తీసుకువచ్చి సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద సమర్పించారు.డోలు వాయిద్యాలు, కొమ్ము శబ్దాల నడుమ మహిళలు నీళ్లు ఆరబోస్తుండగా వడ్డెలు (పూజారులు) గద్దెల వద్దకు చేరుకొని జాగారం చేశారు. పండుగ సందర్భంగా తల్లుల గద్దెలను దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram