గోల్డెన్ న్యూస్ /కరకగూడెం :మండల కేంద్రంలో ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో గురువారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు రోడ్డు భద్రతను కాపాడేందుకు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు చేపట్టారు. వాహన దారులకు సరైన పత్రాలు ఉన్నాయా, హెల్మెట్ మరియు సీటుబెల్ట్ ధరించారా అనే విషయాలు ఈ తనిఖీల్లో పరిశీలించారు.ఎస్‌ఐ మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా బండి రికార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.
Post Views: 60









