గోల్డెన్ న్యూస్/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నా రు. కాంగ్రెస్ ఎన్నికల హామీ ల్లో భాగంగా కీలకమైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పై ప్రభుత్వం అన్నీ దఫాల వడబోత అనంతరం అర్హులను ఎంపిక చేసింది.
ఈ నేపథ్యంలో నేడు శుక్రవారం సిఎం నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా నారాయణపేట మండలం లోని అప్పకపల్లెలో ఇందిర మ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి రాష్ట్రంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 72,045 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, వాటికి నేడు శంకుస్థాపన పనులు మొదలు కానున్నాయి. ఇల్లు లేని కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వ సంకల్పంలో భాగంగా లబ్ధిదారులు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది.
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. మొదటి విడతలో 72,045 లబ్ధిదారుల ఎంపిక
రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఉన్న పేదలు, ఇందిరమ్మ ఇళ్లు కట్టుకు నేందుకు రూ.5,00,000ల చొప్పున నిధులను విడుదల చేయనుంది.
ఈ నిధులను నాలుగు విడతల్లో లబ్ధిదారుడికి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులో భాగంగా తొలి విడతలో లక్ష రూపాయల ను లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయనుం ది. లబ్ధిదారుల జాబితా ప్రస్తుతం ఇన్‌చార్జీ మంత్రుల చేతుల్లో ఉంది. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు 80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా మొదటి విడతలో 72,045 లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసింది.ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, భూమి పూజ చేసిన కుటుంబాలకు తొలి విడతగా ప్రభుత్వం రూ.లక్షను బ్యాంక్ అకౌంట్‌లలో వేయనుంది.
ఆ డబ్బుతో పునాది వేసి గోడలు నిర్మించుకొని, కిటి కీల ఎత్తువరకు గోడలను నిర్మించుకోవాల్సి ఉంటుం ది. అప్పుడు అధికారులు పరిశీలించి, రెండో విడత నగదు పంపిణీని చెల్లిస్తారు. ప్రభుత్వం రెండో విడతగా రూ.1.25 లక్షలను లబ్ధిదారునికి ఇవ్వనుంది. ఆ డబ్బుతో ఇంటి నిర్మాణం దాదాపు పూర్తవుతుంది.
అయితే స్లాబ్ నిర్మాణం కోసం మరో రూ.1.75 లక్షలను ప్రభుత్వం చెల్లించనుంది. ఆ తర్వాత కరెంటు, బాత్రూం, నీటి సరఫరా ఇతరత్రా వాటికి మరో రూ.లక్షను ప్రభుత్వం లబ్ధిదారుడికి చెల్లిస్తుంది. ఇలా మొత్తం రూ.5 లక్షలను లబ్ధిదారుడికి ప్రభుత్వం వారి బ్యాంకు అకౌంట్‌లలో వేయనుంది









