తేదేపా పై బీఆర్ఎస్ నాయకులు, విష ప్రచారం మానుకోవాలి.

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం :తెలుగుదేశం పార్టీని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కెసిఆర్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విష ప్రచారం మానుకోవాల పినపాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు చందా మధు, ధర్మరాజుల శంకర్అన్నారు. తెలుగుదేశం పార్టీ సెంటిమెంటును రగిలించి గత ఎన్నికలలో 10 సంవత్సరాలు లబ్ధి పొందిన టిఆర్ఎస్ మళ్లీ అదే పందాలో వచ్చి లాభపడాలి అని చూడటం అత్యాశే అవుతుంది. గత పది సంవత్సరాల కాలంలో ప్రజలు మీ వంకర బుద్ధి ప్రయత్నాలు ఎత్తుగడలు అన్ని గమనించారని అది అసెంబ్లీ ఎన్నికలలో నిర్ధారణ అయిందని అహంకారపూరితమైన మాటలే మిమ్మల్ని మూలకు కూర్చోబెట్టాయని పార్లమెంటు ఎన్నికలలో మీకు గుండు సున్నా ఇచ్చారని ఈ ఓటమి లతో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్న మీరు తెలుగుదేశం పార్టీని నాయకులను కార్నర్ చేయడం వలన మీకు ఎలాంటి ఉపయోగం ఉండదని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణలో కార్యకర్తలతో నిండినటువంటి పార్టీ అని ఈ తెలంగాణకు నిజమైన న్యాయం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు  అని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ అని ప్రజలకు తెలుగుదేశం పార్టీ వల్ల ఎంత లబ్ది పొందామొ తెలుసని రాబోయే రోజుల్లో మా నాయకుడు చంద్రబాబు ను చూపించి ఎన్నికల్లో సత్తా చాటుతామని అన్నారు.నోరు ఉంది కదా ఏది పడితే అది మాట్లాడితే  ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త రె ట్టుంపు ఉత్సాహంతో రాజకీయంగా మీ అంతు చూస్తామని ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను భ్రష్టు పట్టించి అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని ఇంకా మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు అని అనుకోవడం మీకు సిగ్గుచేటని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి పినపాక నియోజకవర్గం తరఫున హెచ్చరిస్తున్నామని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram