ఎన్ని కఠిన చట్టాలు అమల్లో ఉన్నా, కొందరి కామాంధుల్లో మార్పు రావడం లేదు. మహిళను చూసి అమాంతం రెచ్చిపోతున్నారు. కామంతో కుక్కిలిపోతూ వావివరసలు మరిచి మృగంలా ప్రవర్తిస్తున్నారు. ఆధునిక యుగంలో రాత్రివేళ మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం వచ్చిందని చెప్పుకుంటున్నా, పట్టపగలే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
గోల్డెన్ న్యూస్/నిజామాబాద్ : జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వేగులకి వచ్చింది. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామ శివారులోని నల్లగుట్ట ప్రాంతంలో ఓ యువతిపై స్థానికంగా ఒక తాండాకు చెందిన యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. మోపాల్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతి తన స్నేహితురాలితో కలిసి శనివారం సాయంత్రం ధర్పల్లి మండలంలోని ఓక తాండాకు చెందిన పరిచయమున్న యువకులతో వెళ్లింది. అక్కడ యువతిని ఆమె స్నేహితురాలిని ఎర్టిగా కార్ లో నల్లగుట్ట ఆటవి శివారు ప్రాంతానికి తీసుకు వచ్చిన యువకులు మద్యం తాగించి ఒక యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. మరో యువతి అక్కడి నుంచి తప్పించుకుని పరుగెత్తుకుంటూ వెళ్తుండగా సదరు ఓ వ్యక్తి తారసపడటం విషమ ఆ వ్యక్తికి తెలిపింది. గ్రామస్థులు అక్కడికి చేరుకునేసరికి యువకులు పరార్ అయ్యారు. భాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా విచారిస్తున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. యువతి స్టేట్ మెంట్ ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.









