గోల్డెన్ న్యూస్ : జనగామలో : పది నెలల పాపను అపహరించిన సంఘటన బుధవారం కలకలం రేపింది. ఎస్సై రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం..జనగామ శివారులోని కళ్లెం బైపాస్ ప్రాంతంలో ఓ వ్యాపారి ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం ముంగేలి జిల్లా నుంచి కొన్ని నెలల క్రితం వచ్చిన రామ్బుల్, పార్వతి దంపతులు కూలీలుగా పని చేస్తున్నారు. వీరికి నలుగురు సంతానం. మంగళవారం సాయంత్రం రామ్బుల్, పార్వతిల చిన్న కుమార్తె శివాని(10 నెలలు)ని అక్కడే పని చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన భార్యాభర్తలు సురేష్, ప్రేమలతలు అపహరించారు. కూరగాయల కోసం వెళ్తున్నామని పాన తల్లిదండ్రులకు చెప్పి పాపను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు. తర్వాత తిరిగి రాలేదు. వారి ఫోన్ స్విచ్చాప్ రావడంతో ఆందోళన చెందిన రామ్బుల్, పార్వతి దంపతులు జనగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం ఎస్సై తెలిపారు. నిందితుల ఫోటోను పత్రికలకు విడుదల చేశారు. నిందితుల ఆచూకీ తెలిస్తే 87126 85202, 87126 85259, 8712685260 సమాచారమందించాలని సూచించారు.









