గోల్డెన్ న్యూస్ / అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కొత్తగంగారం గ్రామ శివారులో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడి నిర్వహించారు.. ఎస్ఐ యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం కొత్తగంగారంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడిచేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని, ఆరు కోడిపుంజులు, ఏడు ద్విచక్ర వాహనాలు, 1200 నగదు స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విలేకరులకు తెలిపారు.
Post Views: 58









