గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : నేడు జరుగుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో భాగంగా గురువారం పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు.సింగరేణి కాలరీస్ బాలికల ఉన్నత పాఠశాల మరియు పాల్వంచ బొల్లోరుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ విధులలో ఉన్న అధికారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేయడం జరిగింది.జిల్లా వ్యాప్తంగా ఉన్న 23 పోలింగ్ కేంద్రాలలో 2022 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు.జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Post Views: 62









