గోల్డెన్ న్యూస్ / తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రశాంత వాతావరణంలో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ, నియోజకవర్గాలతో పాటు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, గెలుపు గుర్రాలు ఎవరనేది మార్చి 3న తేలనుంది.973 పోలింగ్ కేంద్రాలు :మూడు స్థానాల్లో ఓటింగ్ కోసం 973 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాల నిఘాతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేశారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవును ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, ఇతర ప్రైవేటు మేనేజ్మెంట్, అథారిటీల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కును వినియోగించుకునేలా యజమాన్యాలు అనుమతి, వెసులుబాటు ఇవ్వాలని అధికారులు కోరారు.
ప్రస్తుతం వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి ఉన్నారు మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా రఘోత్తమ్ రెడ్డి, ఉన్నారు వీరి పదవీకాలం మార్చి 29న ముగియనుంది. ప్రస్తుత ఎన్నికల ఓట్ల లెక్కింపును మార్చి 3న చేపడతారు.









