కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి.

గోల్డెన్ న్యూస్ / ఖమ్మం :  జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో మంగళవారం జరిగిన సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, రైతులకు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు, అభివృద్ధి చేయటం కాంగ్రెస్లోనే సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీతారామ ప్రాజెక్టు ప్రాజెక్టు పూర్తి చేసి రైతు పక్షపాతి పార్టీగా మాటని పెట్టుకుంది అన్నారు. సీతారామ గోదావరి జలాలను రాజీవ్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయడం జరిగిందని దీంతో సాగర్ ఆయకట్ట పరిధిలో రైతులు కళ్ళల్లో ఆనందం వెళ్లి విరుస్తుందని  వారు అన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram