తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒకపూట బడులు

గోల్డెన్ న్యూస్ /తెలంగాణ : అసలు ఎండాకాలం ఇంకా ముందే ఉంది.. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఎండల తీవ్రమవుతున్న ఎక్కువవుతుంది. దీంతో ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది.ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఒక పూట బడులు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షాకేంద్రాలున్న బడుల్లో మాత్రం మధ్యాహ్నం పూట స్కూళ్లను నిర్వహిస్తారు.మరోవైపు కొన్న ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అప్పుడే 35 డిగ్రీలు దాటుతున్నాయి. దీంతో ఈ నెల 15కు ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే రంజాన్‌ పండుగ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ స్కూళ్లకు విద్యార్ధులకు ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram