గోల్డెన్ న్యూస్ / ఖమ్మం : కూసుమంచిలోని కార్యలయంలో శుక్రవారం రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ, ఇచ్చిన హామీలు నెరవేర్చడంకోసం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పది రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. నెలాఖరుకి రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు.
Post Views: 50









