తండ్రికి జీవిత ఖైదు… కూతురు ఆత్మహత్యాయత్నం

తండ్రికి జీవిత ఖైదు శిక్ష విధించడంతో.. పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానని కూతురి రోదన

గోల్డెన్ న్యూస్ / నల్లగొండ : మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో సోమవారం నల్లగొండ కోర్టు సంచలన తీర్పును ప్రకటించింది. విజితమే ఏ2 సుభాష్ శర్మ కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించారు.ఈ కేసులో మారుతి రావు సోదరుడు శ్రవణ్ ఏ6గా ఉన్నారు.  ఈ తీర్పులో ఆయనకు జీవిత ఖైదు చేశారు. తీర్పు విషయం తెలుసుకున్న ఆయన భార్య, కుమార్తె కోర్టుకు చేరుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. తన తండ్రి తప్పు చేయలేదని. అమృత తండ్రి చేసిన పనికి మా నాన్నకు శిక్ష విధించారని వాపోయారు. మా నాన్న తప్పు చేయలేదు అన్యాయంగా మా నాన్నకు శిక్ష వేశారని.. నేను కోర్టు ఆవరణలో పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానని రోదించింది. ఈ రోజు కోర్టు ఇచ్చిన తీర్పులో మాకు న్యాయం జరుగలేదని.. మీడియా నే మా నాన్నను దోషిని చేసిందని .. కనీసం మా నాన్నను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని ఆ యువతి కన్నీటి పర్యంతం అయింది.

Facebook
WhatsApp
Twitter
Telegram