కలెక్టరేట్లో కి దూసుకెళ్లిన అంగన్వాడి టీచర్స్

గోల్డెన్ న్యూస్ /భువనగిరి:  తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సభ్యులు మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోకి దూసుకెళ్లారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యలను వినాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముందు 48 గంటల ధర్నా, వంటవార్పు కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. రాత్రి కూడా ఇక్కడే అంగన్వాడీ మహిళలు నిద్రిస్తూ నిరసన తెలియజేశారు. రెండో రోజు జరిగిన ఆందోళనలో అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు, జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం, అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బూరుగు స్వప్న, కార్యదర్శి సిల్వరు రమాకుమారి పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram