కేవలం ఎనిమిది రోజుల్లోనే పూర్తి కావాల్సిన సునీతా విలియమ్స్ అంతరిక్షయానం సాంకేతిక కారణాల వల్ల సుదీర్ఘ కాలం అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు 9 నెలల తర్వాత అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఆమె ఎట్టకేలకు భూమ్మీదకు వచ్చారు. ఇప్పుడు ఆమె ఏం చేస్తారు అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
తొమ్మిది నెలలుగా తర్వాత సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమిపైకి చేరుకోవడం వల్ల భారత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. గుజరాత్‌లోని ఝూలాసన్‌లో సునీతా విలియమ్స్‌కు చెందిన ఆమె బంధువులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు, బాణా సంచా కాల్చుతూ డ్యాన్సలు చేశారు. అంతకుముందు ఆమె సురక్షితంగా రావాలని ఆ గ్రామంలోని దేవాలయంలో పూజలు నిర్వహించి యజ్ఞం చేశారు.
Post Views: 61









