ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం.. కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు

సంబరాలు చేసుకొని బాణాసంచ కాల్చిన కాంగ్రెస్ నాయకులు.

పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్దే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

కరకగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ 

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం :  కరకగూడెం మండల కేంద్రంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ పొదెం వీరయ్య  ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం చేసుకున్న సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు రాజీవ్ గాంధీ  విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.అనంతరం వారు మాట్లాడుతూ..

➡️ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారాధ్యంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసిందన్నారు..

➡️ ఈ బిల్లులో ఎస్సీలుగా ఉన్న 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా చేసి 15% రిజర్వేషన్ కల్పించడం జరిగిందని అన్నారు..

➡️ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్దే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు..

➡️తెలంగాణ ఎస్సీ ప్రజలకు ఇంతటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి,అదేవిధంగా క్యాబినెట్  మంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram