వస్తువుల విక్రయాల్లో నాణ్యత పాటించాలి

వినియోగదారుల హక్కు ఫోరం జిల్లా అధ్యక్షుడు సారిక లింగయ్య 

గోల్డెన్ న్యూస్/  మణుగూరు : వినియోగదారుల హక్కు ఫోరం ఫౌండర్ చైర్మన్ నలమస శ్రీకాంత్ గౌడ్ ఆదేశాల మేరకు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సారిక లింగయ్య , డిప్యూటీ చైర్మన్ చెట్టి పల్లి దామోదర్ , తన సిబ్బందితో కలిసి పట్టటడం వివిధ మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ముఖ్యంగా సూపర్ మార్కెట్లు, హోటళ్లు, కిరాణా దుకాణాలు, కూల్‌డ్రింక్స్ మరియు ఇతర నిత్యవసర వస్తువులను విక్రయించే వ్యాపార స్థాపనలను పరిశీలించారు.ఈ సందర్భంగా, కొన్ని దుకాణాల్లో గడువు ముగిసిన ఉత్పత్తులను విక్రయించడం, అధిక ధరలకు విక్రయం జరగడం, నాణ్యతలో లోపాలు ఉండటం వంటి అంశాలను గుర్తించారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించే వ్యాపారులను కఠినంగా హెచ్చరించారు. ప్రజలు నాణ్యమైన సేవలు పొందేందుకు ప్రతి వ్యాపారి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించాలని సూచించారు.

ఈ తనిఖీల ద్వారా వ్యాపారులు వినియోగదారుల హక్కులను గౌరవించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సారిక లింగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్జ్యూమర్ రైట్స్ వైస్ చైర్మన్ సురేష్, సభ్యులు, మరియు ఇతర సంబంధిత విభాగాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల న్యాయమైన హక్కులను కాపాడే విధంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు…

Facebook
WhatsApp
Twitter
Telegram