పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.. డి ఈ ఓ

శుక్రవారం  నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

జిల్లావ్యాప్తంగా 16,788 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం / శుక్రవారం నుంచి పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో  మొత్తం 16,788 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఈ. సోమశేఖరశర్మ ఈ సందర్భంగా అధికారులకు విద్యార్థులకు పలు సూచనలు చేశారు.అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ఫర్నిచర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని సూచించారు..

Facebook
WhatsApp
Twitter
Telegram