వేధింపులు తాళలేక కొడుకును చంపిన తల్లీ

మద్యానికి బానిసైన కొడుకును చంపిన తల్లీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఘటన

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం: ఓ కొడుకు వేధింపులు తాళలేక తల్లి ఉరివేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై రమణా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఎదురుగడ్డకు చెందిన రాజకుమార్ (40) మద్యానికి బానిస అయి నిత్యం భార్య, పిల్లలు, తల్లిని వేదిస్తున్నారు. భర్త వేధింపులు భరించలేక అతని భార్య సుకన్య కూతురికి ఉరి వేసి, తను ఉరి వేసుకుంది. ఇది చూసిన తల్లీ దూడమ్మ కోడలిని కాపాడింది సుకన్య కూతురు చనిపోయింది.అయిన కొడుకు ప్రవరతనలు మార్పు రాలేదు. వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.గురువారం రాజాకుమార్ మద్యం సేవించి ఇంట్లో గొడవ పడి వేదిస్తున్న కొడుకును చంపాలని నిర్ణయించుకుంది తల్లి.మద్యం మత్తులో నిద్రిస్తున్న కొడుకు కాళ్ళు చేతులు కట్టేసి ఉరి వేసి చంపింది. ఈ విషయం కోడలు సుకన్యకు చెప్పింది. సుకన్య ఈ విషయాన్ని లక్ష్మీదేవిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram