కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య.

కుటుంబ కలహాల నేప‌థ్యంలో ఓ వ్యక్తి  పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : కుటుంబ కలహాల  నేప‌థ్యంలో పురుగుల మందు సేవించి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న కరకగూడెం మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు ప్రకారం .. మండలంలోని మోతే గ్రామానికి చెందిన నైనారపు  సాగర్ (30) ఈనెల 9 వ తేదీన ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో గొడవ పడి క్షీణిక ఆవేశంలో పురుగుల మందు సేవించాడు. కుటుంబ సభ్యులు గమనించి కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి108 వాహనంలో మణుగూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి ఇటీవల ఇంటికి తీసుకుని రాగా గురువారం మృతి చెందాడు. మృతుడు భార్య నాగేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేందర్ తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram