15 రోజుల చిన్నారిని చంపిన తల్లి

భర్త ఆరోగ్యపరిస్థితి బాగోలేదని 15 రోజుల ఆడపిల్లను చంపేసిందో తల్లి. ఆడపిల్ల పెద్దయ్యాక ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయని భావించి నీళ్ల బకెట్లో లో వేసింది. పోలీసు కేసు నుంచి తప్పించుకోవడానికి గుర్తుతెలియని వ్యక్తులు నీళ్లలో పడేశారని నాటకానికి తెరలేపింది.

గోల్డ్ న్యూస్ / హైదరాబాద్ :  నవ మాసాలు మోసి కన్న బిడ్డను తన చేతులతో కడతేర్చింది. మైలార్ దేవ్ పల్లి ఆలీ నగర్ లో శుక్రవారం ఉదయం ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.

 

15 రోజుల పసికందుని తల్లి చంపేసింది. పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తు గా క్రియేట్ చేసింది. స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో పసికందు పడిపోయిందని నాటకమాడింది. 14 రోజుల పసికందుని తల్లి చంపి నట్లుగా పోలీసులు నిర్ధారించారు.

 

ఆర్థిక సమస్యలతోనే పసికందుని చంపినట్లుగా గుర్తించారు. భర్తకు రెండు కిడ్నీలు చెడిపోవడం, కుటుంబ పోషణ భారంగా మారడంతో పసికందు హత్య చేసింది. ఈ మనీ, విజ్జు దంపతులు తమిళనాడుకు చెందిన కుటుంబం..

 

పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చారు. ఆమె కాటేదాన్ లోని ఓ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తోంది. భర్తకు చికిత్స చేయించ లేక, కుటుంబం పోషించ లేక తల్లడిల్లింది

 

భార్య విజ్జి. భర్త మణికి డయాలిసీస్ చేసుకోవడం, అప్పుడే పండండి బిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఏమి చేయాలో తోచక కన్న పేగును హతమార్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram