నలుగురికి గాయాలు
గోల్డెన్ న్యూస్ / అశ్వాపురం : మండల కేంద్రంలో శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి తన మామ కడితి నరసింహులు, అత్త వనజాక్షి, భార్య స్రవంతిలపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్లకు చెందిన శ్రావణ్ కుమార్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. భార్య స్రవంతి చాలాకాలంగా ఆయనతో ఉండటం లేదు. అశ్వాపురంలో తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమెను తీసుకుపోవడం కోసం అతను ఇక్కడకు వచ్చాడు. ఆమెతో గొడవ పడుతుండగా తల్లిదండ్రులు అడ్డుగా వెళ్లడంతో కత్తితో దాడి చేశాడు. అడ్డుకోవడానికి వెళ్లిన మరోకరిపై దాడి చేశాడు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వారిని మణుగూరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అశ్వాపురం సీఐ జి అశోక్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Post Views: 39









